హైదరాబాద్‌లో ఇద్దరు పబ్బు డీజేల అరెస్టు

-

హైదరాబాద్‌లో ఇద్దరు పబ్బు డీజేలు అరెస్టు అయ్యారు.పబ్బుల్లో పనిచేస్తూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న బెంగళూరు చెందిన డీజే సన్నితో పాటు హైదరాబాద్‌ కు చెందిన డీజే అఖిల్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.ఇద్దరు కలిసి MDMA కొకైన్‌, గంజాయి సరఫరా చేస్తూ హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ ఉన్నారు.

పబ్బులకు వచ్చే వీఐపీ కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా డీజేలు చేస్తున్నారు .బెంగళూరు, హైదరాబాద్‌ పబ్బుల్లో MDMA, గంజాయి సరఫరా చేస్తుండగా ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.ఇద్దరి దగ్గరి నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.వీరితో పాటు ఇద్దరు విద్యార్థులను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఇంకా ఇద్దరు డీజేలు ఎవరికి డ్రగ్స్‌ సరఫరా చేశారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news