ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పెన్షన్ల కోసం రూ. 4,400 కోట్ల విడుదల

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇవాళ ఏపీ సీస్ నీరబ్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ. 4,400 కోట్ల విడుదల చేశారు నీరబ్ కుమార్. జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింట ఫించన్లు పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.  ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని తెలిపారు. జులై 01, 2024  సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని తెలిపారు. ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాలన పరంగా కొత్త మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news