టైలర్ కన్హయ్యలాల్ మర్డర్ కేసులో రాజస్థాన్‌లో హైటెన్షన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనకారులు భారీ ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. దీంతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు ప్రధాన నగరాల్లో సెక్షన్ 144 అమలు చేసింది ప్రభుత్వం. అయినా నిరసనకారులు కర్ఫ్యూని కూడా లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. రాజస్థాన్‌లో హిందూ సంఘాలు నిందితులను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టైలర్ కన్హయ్య హత్య కేసులో సీఎం అశోక్ గెహ్లాట్ మరోసారి స్పందించారు. హంతకులిద్దరికీ ఐసీస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితులు గౌస్ మహమ్మద్, రియాజ్ మహమ్మద్ ఇప్పటికే జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో వీరి హస్తం ఉందని గుర్తించామన్నారు. ఈ మేరకు జాతీయ దర్యప్తు సంస్థ ఢిల్లీలో విచారణ చేపట్టిందని, ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తేల్చి చెప్పిందన్నారు. ఇది రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాదని, ప్రజలు నిరసనలు నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.