మన పొరుగు దేశమైన చైనాలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. యాగి అనే పెను తుఫాన్ చైనాను కొద్దిపేస్తోంది. దీంతో చైనా లో చాలా ప్రాంతాలలో శుక్రవారం నుంచే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. యాగి తుఫాన్ ఎఫెక్ట్ తో… దక్షిణ చైనా అతలాకుతలమవుతోంది. దీంతో పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది చైనా ప్రభుత్వం.
అయితే ఈ తుఫాను నేపథ్యంలో దాదాపు ఇప్పటికే 92 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరణించిన వారి లెక్కలు మాత్రం చైనా ప్రకటించడం లేదు. అయితే ఈ తుఫాను నేపథ్యంలోనే ముందుగా అలర్ట్ అయిన చైనా… దక్షిణ చైనా ప్రాంతంలో ఉన్న స్కూలు అలాగే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుఫాను తగ్గుముఖం పట్టే వరకు విద్యార్థులు పాఠశాలకు రాకూడదని సూచించింది. అంతేకాదు చైనాలో ఈ తుఫాను బీభత్సం సృష్టించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.