సరికొత్త పరిణామం, తాలిబన్ల తో అమెరికా శాంతి ఒప్పందం

-

అగ్రరాజ్యం అమెరికా కొత్త పరిణామానికి తెరతీసింది. తాలిబన్ల కు,అమెరికా బలగాలకు మధ్య కొన్నేళ్లుగా జరుగుతున్న పోరాటానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఫలించి ఇరు వర్గాల మధ్య డీల్ కుదర్చుకుంటూ ఈ రోజు దోహా లో సంతకాలు చేసాయి. దీనితో అమెరికా,తాలిబన్లు దాడులు,ప్రతిదాడులు ముగింపు పలకనున్నాయి. ఖతార్ లోని దోహా లో ఇరు వర్గాలు ఈ తాజా డీల్ పై సంతకం చేయనుండగా ఈ ఈవెంట్ కు భారత్ తో పాటు మరో 30 దేశాల ప్రతినిధులు కూడా ఈ శాంతి ఒప్పంద కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తుంది. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రం ఈ శాంతి ఒప్పందానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. తాలిబన్లకు, అమెరికా బలగాలకు మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాలు పరస్పరం పైచేయి సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అయితే ఇరు వర్గాల చర్యల కారణంగా వందలమంది అమాయక ప్రజలు బలవ్వడం తో పాటు ఆప్ఘనిస్థాన్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది.

అయితే అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్, గత ఏడాది ఆఫ్ఘన్ విషయంలో తన సంచలన ప్రకటన చేశారు. ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ను ఉపసంహరించుకుంటామని, ఆప్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనకు తాలిబన్లతో చేతులు కలుపుతామంటూ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. అయితే ఈ శాంతి ఒప్పందం తో హింసా త్మక వాతావరణానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తెలియాల్సిన విషయం ఏమిటంటే అసలు ఈ శాంతి ఒప్పందం తో ఇరు వర్గాల మధ్య ఎలాంటి షరతులతో కూడిన ఒప్పందం కుదుర్చుకుంటుంది అన్న విషయం పై మాత్రం వారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news