మహారాష్ట్రలో కరోన కేసులు వేగంగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా కేసులు దాదాపు చైనాతో సమానంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే మహారాష్ట్రలో చైనాకు మించి కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాబోయే రెండు మూడు వారాలు కూడా మహారాష్ట్రకు చాలా కష్టంగా ఉండే సూచనలు అన్ని విధాలుగా కనపడుతున్నాయి. అక్కడ కరోన కట్టడి అయ్యే అవకాశ౦ లేదు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే గ్రామాల్లోకి కరోనా వైరస్ వెళ్ళింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సిఎం ఉద్దావ్ థాకరే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. మిత్ర పక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఆయనకు తీవ్ర ఒత్తిడి వస్తుందని దాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు అని అక్కడి వారు అంటున్నారు.
ఇక కేంద్రం కూడా ఆయన విషయంలో కాస్త ఆగ్రహంగా ఉందని అసలు కరోనా నియంత్రణ లో ఒక ప్లానింగ్ లేకుండా ఆయన ముందుకు వెళ్ళారు అని కేంద్రం భావిస్తుంది అని అంటున్నారు. అందుకే ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్న సంగతి తెలిసిందే.