వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుండే అక్కడి పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. దివంగత పార్టీ చీఫ్ ఎం కరుణానిధి జన్మస్థలం నాగపట్నం సమీపంలోని తిరుక్కువలై నుంచి డీఎంకే అధ్యక్షుడు ఎం కె స్టాలిన్ కుమారుడు మిస్టర్ ఉదయనిధి శుక్రవారం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక తన పార్టీ 75 రోజుల ప్రచారంలో రెండవ రోజు డిఎంకె యూత్ వింగ్ కార్యదర్శి, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రచారం చేస్తోండగా నాగపట్నంలో నిన్న పోలీసులు అరెస్టు చేశారు. నాగపట్నంలోని ఫిషింగ్ గ్రామమైన అక్కరై పెట్టాయ్ వద్ద అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిన్న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఉదయనిధి అక్కరై పెట్టాయ్ గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులతో సంభాషించారు. తమిళనాడు మాజీ మంత్రులు కెఎన్ నెహ్రూ, యు మతివానన్, ఎంఆర్కె పన్నీర్‌సెల్వం మరియు ఇతరులతో కలిసి, ఉదయనిధి మత్స్యకారులతో సముద్రంలో పడవ ప్రయాణం చేశారు. అతను ఒడ్డుకు తిరిగి వచ్చినప్పుడు, నాగపట్నం అదనపు పోలీసు సూపరింటెండెంట్ నేతృత్వంలోని పోలీసు బృందం ఉదయనిధిని COVID-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు అలానే అనుమతి లేకుండా ప్రచారం చేసినందుకు అరెస్టు చేసింది.