చౌకగా డ్రోన్లను తయారు చేస్తున్న ఉడుపి వాసి!

-

కర్ణాటక ఉడుపి జిల్లాకు చెందిన ఒక కుర్రాడు చౌకైన డ్రోన్​ను తయారు చేశాడు. ఇందుకోసం అందుబాటులో ఉన్న విడిభాగాలను ఉపయోగించాడు. ఇప్పటికే ఇలాంటి 20 లోహ విహంగాలను అతడు రూపొందించాడు. పీయూసీ చదువుతున్న గ్లెన్​ రెబెల్లోకు చిన్నతనం నుంచే విమానాలపై మక్కువ. ఆ తర్వాత.. వివాహ వేడుకలను చిత్రీకరించే డ్రోన్లపై అతడికి ఆసక్తి పెరిగింది. దీంతో వాటి గురించి విస్తృతంగా అధ్యయనం చేసి, సొంతంగా ఒక డ్రోన్​ను తయారు చేశాడు. తర్వాత.. రేసులకు ఉపయోగపడే లోహ విహంగాలనూ రూపొందించాడు.

drone
drone

సాధారణంగా డ్రోన్లు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. గ్లెన్​ మాత్రం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే డ్రోన్లను తయారు చేశాడు. అతడు రూపొందించిన సాధనాలను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఈ తరహా బుల్లి లోహ విహంగాలు రూ.2 లక్షల ధర పలుకుతుండగా, గ్లెన్​ మాత్రం రూ.30-40వేల ధరతో వాటిని అందిస్తున్నాడు. ఇతర డ్రోన్​లను మరమ్మతు చేసే సామర్థ్యాన్ని కూడా అతడు సంపాదించాడు.గతంలో ఉడుపి, మంగళూరులోని ఆపరేటర్లు తమ డ్రోన్లను మరమ్మతు చేయించుకోవడానికి ముంబయి వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు గ్లెన్​ వద్దకు వారు వస్తున్నారు. భవిష్యతులో ఏరోనాటిల్​ ఇంజినీర్​ కావాలన్నదే తన కల అని అతడు చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news