కేవ‌లం రూ.1299కే బోట్ నూత‌న వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్

-

ఆడియో ప్రొడ‌క్ట్స్‌ను త‌యారు చేసే బోట్ కంపెనీ కొత్త‌గా ఎయిర్‌డోప్స్ 131 పేరిట నూత‌న వైర్ లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇన్‌స్టా వేక్ అండ్ పెయిర్ (ఐడ‌బ్ల్యూపీ) టెక్నాల‌జీని వీటిలో ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఇవి ఫోన్ల‌కు చాలా వేగంగా క‌నెక్ట్ అవుతాయి. బ్లూటూత్ 5.0 ద్వారా వీటిని ఫోన్ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.

boAT Airdopes 131 wireless earbuds launched in india

ఈ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను యూఎస్‌బీ టైప్ సి ద్వారా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. వీటికి మ‌ల్టీ ఫంక్ష‌న్ బ‌ట‌న్ల‌ను అందించారు. ఇవి అత్యంత త‌క్కువ బ‌రువును క‌లిగి ఉంటాయి. ఒక్కో ఇయ‌ర్ బ‌డ్స్ బ‌రువు కేవ‌లం 3.5 గ్రాములు మాత్ర‌మే ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తేలిగ్గా తీసుకెళ్ల‌వ‌చ్చు. వీటిల్లో 13 ఎంఎం డ్రైవ‌ర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది.

ఈ ఇయ‌ర్ బ‌డ్స్ ద్వారా యూజ‌ర్లు మ్యూజిక్ విన‌వ‌చ్చు. కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు. మూవీలు, వీడియోలు చూడ‌వ‌చ్చు. ఒక్క‌సారి వీటిని ఫుల్ చార్జింగ్ చేస్తే 3 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయి. చార్జింగ్ కేస్‌తో 15 గంట‌ల వ‌ర‌కు బ్యాక‌ప్ వ‌స్తుంది. బ్లాక్‌, మిడ్‌నైట్‌, చెర్రీ బ్లాస‌మ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో బోట్ ఎయిర్‌డోప్స్ 131 ఇయ‌ర్ బ‌డ్స్ యూజ‌ర్ల‌కు రూ.1299 ధ‌ర‌కు ఎక్స్ క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ఆగ‌స్టు 22 నుంచి ల‌భిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news