ఉగాది పండుగ సందర్బంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీసులో పండుగ వేడుకలను నిర్వహించారు.ఉగాది పచ్చడిని స్వయంగా కలిపి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే మాజీమంత్రి జగదీశ్ రెడ్డిని స్థానిక పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉగాది పండుగ వేడుకల సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయానికి BRS శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.శాలువాలు, బొకేలతో జగదీష్ రెడ్డికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదిలాఉండగా, అటు తెలంగాణ భవన్‌లోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతుల మీద ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు.