బ్రేకింగ్; విమానం కూల్చేసింది మేమే…!

-

ఉక్రెయిన్ విమానాన్ని తామే పొరపాటున కూల్చేసామని ఇరాన్ అంగీకరించింది. ఇటీవల ఇరాన్ లో ఉక్రెయిన్ కి చెందిన జనవరి 8న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో ఉన్న 178 మంది ప్రయాణికులు మరణించారు.

దీనిపై అంతర్జాతీయ సమాజం అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా కెనడా ప్రధాని ట్రూడో ఈ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలను వ్యక్తం చేసారు. ఆ విమానం క్షిపణి వలనే కూలిపోయిందని, తమ నిఘా వర్గాలు ఈ విషయాన్ని ద్రువీకరించాయని ఆయన పేర్కొన్నారు. విమానంలో 70 మంది కెనడా పౌరులు ఉన్నారు. ఈ విషయాన్ని తొలుత అంగీకరించని ఇరాన్ తాజాగా దీనిపై కీలక ప్రకటన చేసి ఆశ్చర్యపరిచింది.

ఇరాన్ విమానాన్ని కూల్చేసింది తామేనని ప్రకటించింది. విమానాన్ని క్షిపణితో కూల్చేశామని పేర్కొంది. ఆర్మీ సైట్‌కు దగ్గరగా రావడంతో తామే పొరపాటున కూల్చేశామని ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ జెట్‌ను “అనుకోకుండా” కాల్చివేసినట్లు ఇరాన్ అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఆధారంగా కెనడా అనుమానాలను వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news