నలుగురిని చంపేసిన పులి…!

-

గత కొన్నేళ్ళుగా వన్యప్రాణులు జనాల్లోకి వచ్చి భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులు, పులులు, చిరుత పులులు జనావాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. అడవుల్లో ఆహారం దొరక ఊళ్ళ మీద పడుతున్నాయి అటవీ జంతువులు. తాజాగా కర్నాటకలోని తముకూరులో ఒక చిరుత పులి ఇదే విధంగా చేస్తుంది. గత కొంత కాలంగా ఒక చిరుతపులి తముకూరు తాలుకాలోని మన్నకుప్పే గ్రామంలో తిరుగుతుంది.

ఊర్లోకి వచ్చి జనాన్ని చంపి తినేస్తుంది ఆ చిరుత పులి. దీనితో జన౦ హడలిపోతున్నారు. రెండ్రోజుల క్రితం ఒక బాలుడ్ని చంపి తినేసింది చిరుత పులి. మూడు నెలల్లో ఇది నాలుగో మరణం. దీనితో గ్రామం నుంచి ప్రజలు కాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి తలెత్తింది. దీనితో అటవీ అధికారులు, అడవుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు. ఆ చిరుత జాడ కనుక్కున్నారు. అది కెమెరా కంటపడింది.

ఈ చిరుతను చంపేయాలనీ, అధికారులు పట్టించుకోవట్లేదనీ అధికారులు గనక చంపలేకపోతే, తామే చిరుతను చంపేస్తామని హెచ్చరించారు. చిరుత వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే వరకూ వెళ్లడంతో, అధికారులు దాని కోసం వేట మొదలుపెట్టారు. అధికారులకు గ్రామస్థులు 15 రోజులు టైమ్ ఇచ్చారు. ఆలోగా పట్టుకోకపోతే… తామే చంపుతామని స్పష్టం చేసారు. తాజాగా చనిపోయిన పిల్లాడి కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news