ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి సాయం కోరుతున్న ఉక్రెయిన్.. రష్యాతో చర్చలకు కూడా సిద్ధం అవుతుంది. ఇప్పటి కే రెండు సార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో మూడో సారి చర్చలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది. దాని కోసం రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది. కాగ రెండు రోజుల్లో రష్యాతో చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు.
అందు కోసం రష్యాతో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని తెలిపారు. చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కరం లభిస్తుందని ఆయన అన్నారు. కాగ ఇప్పటి వరకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండు సార్లు జరిగాయి. అయితే ఈ రెండు దఫాలలో జరిగిన చర్చలు.. యుద్ధాన్ని అపలేక పోయాయి. అయితే గురు వారం బెలారస్ లో రెండో దఫా జరగిన చర్చల్లో పౌరులను తరలించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. దాని కోసం మానవతా కారిడార్ ను నిర్వహించాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.