ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడి….20 మంది మృతి

-

ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభం అయి 44 రోజులు గడిచాయి. అయినా యుద్ధానికి ముగింపు రావడం లేదు. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా… రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన రష్యన్ బలగాలు వెనుదిరిగాయి. గత నెల రోజులుగా కీవ్ ను దక్కించుకునేందుకు శతవిధాల రష్యా ప్రయత్నం చేసినప్పటికీ… ఉక్రెయిన్ సేనలు నిలువరించాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచి రష్యా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుందనే వ్యూహాన్ని రష్యా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు తగ్గట్లుగానే రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగంలో దాడులు చేస్తోంది. తాజాగా రష్యా రెండు రాకెట్లతో ఉక్రెయిన్ లోని రైల్వే స్టేషన్ దాడి చేసింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత నగరమైన క్రామాటోర్క్స్ లో పౌరులను తరలించేందుకు వినియోగిస్తున్న ఓ రైల్వే స్టేషన్ పై రష్యా దాడి చేసింది. ఈదాడిలో కనీసం 20 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news