రష్యా సైన్యంపై పుతిన్ ఆగ్రహం… 8 మంది మేజర్ జనరల్స్ తొలగింపు

-

రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి దాదాపు మూడు వాారాలకు చేరింది. ఇదిలా ఉంటే అంత పెద్ద సైన్యం, ఆయుద్ధ సంపత్తి ఉన్న రష్యాకు… చిన్న దేశం ఉక్రెయిన్ ను లొంగదీసుకోలేకపోతోంది. వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో యుద్ధవిమానాలను, హెలికాప్టర్లను కోల్పోతోంది. మరోవైపు 12 వేల మంది రష్యన్ సైనికులను చంపామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇద్దరు మేజర్ జనరల్ స్థాయి అధికారులను రష్యా కోల్పోయింది. రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు ఎదురించి పోరాడుతున్నాయి. మూడు వారాలుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా హస్తగతం చేసుకోలేకపోతోంది. మరోవైపు యుద్దంలో గెలుస్తామంటూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే రష్యా సైన్యంపై అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో సైన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు పుతిన్. ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్ ను కోల్పోయిన తరుణంలో అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 8 మంది మేజర్ జనరల్స్ తో పాటు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లో ఉన్నవారిపై వేటు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version