తెలంగాణలో అరుదైన సంఘటన..హిజ్రాను పెళ్లాడిన యువకుడు

-

ఓ యువకుడు ఏకంగా హిజ్రా ని పెళ్లి చేసుకున్నాడు. మూడు సంవత్సరాల కింద ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత ఆ హిజ్రా కు మూడుముళ్లు వేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… భూపాలపల్లి మండలం లోని రూపేష్ అనే యువకుడు అల్లపల్లి మండల పరిధిలోని అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

marraige

ఈ పరిచయం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు గాఢ ప్రేమికులు అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇల్లందులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరు కలిసి ఉంటూ వచ్చారు. అంటే వీరు గత మూడు నెలలుగా సహజీవనం చేస్తూ వచ్చారు. అయితే తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలా రహస్యంగా ఉండడం ఇష్టం లేని రూపేష్ తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి… తాజాగా ఘనంగా జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version