ఉక్రెయిన్ కు మరోసారి భారత్ షాక్… జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ కు దూరం

-

ఉక్రెయిన్ కు మరోసారి షాక్ ఇచ్చింది భారత్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికపై మరోసారి తన తటస్థతను పాటించింది. యూఎన్ఓ ప్రవేశపెట్టిన తీర్మాణానికి మరోసారి ఓటింగ్ దూరంగా ఉంది. ఇటు రష్యాకు, అటు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంది. 193 సభ్య దేశాలు కలిగిన సభలో 141 దేశాలు తీర్మాణానికి అనుకూలంగా ఓటేయగా.. 5 దేశాలు వ్యతిరేఖంగా ఓటేశాయి. 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేఖించిన ఐదు దేశాల్లో బెలారస్, ఎరిత్రియా, సిరియా, నార్త్ కొరియా, రష్యా దేశాలు ఉన్నాయి. 

గత వారం రోజుల్లో యూఎన్ఓలో రష్యా- ఉక్రెయిన్ మధ్య రష్యాను వ్యతిరేఖిస్తూ.. మూడుసార్లు తీర్మాణం పెట్టారు. ఈమూడు తీర్మాణాలకు ఇండియా దూరంగా ఉంది. రష్యా, ఉక్రెయిన్ రెండు కూడా భారత్ కు మిత్రదేశాలే కావడంతో ఓటింగ్ కు గైర్హాజరు అవుతోంది. ప్రస్తుతం ఉక్రెయన్ లో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడటమే భారత్ తొలి ప్రాధాన్యతగా ఉంది. రెండు దేశాాలు కూడా దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news