నేడు రష్యా – ఉక్రెయిన్‌ మధ్య రెండో విడత చర్చలు

-

ఇవాళ రష్యా – ఉక్రెయిన్‌ దేశాల మధ్య రెండో విడత చర్చలు జరుగనున్నాయి. రెండు దేశాలు శాంతి చర్చలకు అంగీకారం తెలపడంతో.. రెండో విడత చర్చలు ఇవాళ జరుగనున్నాయి. పోలాండ్‌ – బెలారస్‌ సరిహద్దుల్లో ఇవాళ మరోసారి చర్చలు జరుగనున్నాయన్న మాట. సోమవారం రోజున రష్యా – ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే.

తక్షణమే యుద్దాన్ని విరమించాలని ఉక్రెయిన్‌ ఈ చర్చల్లో కోరగా.. దానికి రష్యా ససేమిరా అన్నది. తొలి విడత జరిగిన చర్చల్లో ప్రాథమిక డిమాండ్ల పై పట్టు వదలలేదు రెండు దేశాలు. నాటో కూటమికి దూరంగా ఉండాలని అటు రష్యా పట్టుబడుతోంది.

క్రిమియాను తమ దేశంలో.. అంతర్భాగంగా గుర్తించాలని కోరుతోంది రష్యా. అయితే.. దీనికి ఉక్రెయిన్‌ అంగీకారం తెలపడం లేదు. ఇక ఇవాళ జరిగే చర్చలపై ఆసక్తి గా ఎదురు చూస్తున్నాయి పశ్చిమ దేశాలు. ఇక ఈ రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని భారత్‌ లాంటి చాలా దేశాలు కోరుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news