కోడలిపై మామ అత్యాచారం… ప్రశ్నించినందుకు కొడుకునే చంపేశాడు..!

ఇటీవలె కాలంలో చిన్నాపెద్దా అని తేడాలేకుండా ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తన, పర అనే భేదం లేకుండా సొంత కుటుంబీకులే వావీ వరసలు మరచి.. అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటననే ఉత్తరప్రదేశ్​లోని మజోలాలో జరిగింది. తన సొంతకోడలిపైనే మృగంగా మారిన మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. అదేంటని అడిగిన కొడుకుని కాల్చి చంపేశాడు.

rape
rape

ఉత్తరప్రదేశ్‌లోని మొరదబాద్‌ జిల్లా మజోలాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ(56) తన కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ విషయం కాస్తా బాధితురాలు తన భర్తకు చెప్పగా.. అతను తన తండ్రిని నిలదీశాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన మామ.. కోడలి భర్తైన తన సొంత కొడుకునే తుపాకితో కాల్చి చంపేశాడు. చనిపోయిన వ్యక్తికి, బాధితురాలికి ఏడాది క్రితమే వివాహమయ్యిందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే నవంబర్ 25వ తేదీన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా బాధితురాలి భర్త, అత్త అక్కడికి వెళ్లారు. ఇంట్లో బాధితురాలు, ఆమె మామ మాత్రమే ఉన్నారని వెల్లడించారు.

ఆ సమయంలో మృగంగా మారిన మామ వరసలు మరచి తన కూతురిలాంటి కోడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని శుభకార్యం ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన తన భర్త, అత్తకు బాధితురాలు చెప్పింది. దానితో ఆగ్రహించిన భర్త.. తన తండ్రిని నిలదీశాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించాడు. అలా తండ్రికి, కొడుక్కి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తండ్రి తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని తీసుకువచ్చి కొడుకుని కాల్చాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా.. అప్పటికే అతను చనిపోయాడు. దానితో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.