దేశవ్యాప్తంగా అమలు కానున్న తెలంగాణ రైతు బంధు.. ఏటా రూ.6 వేలు

-

Pradhan Mantri Kisan Samman Nidhi, 6000 rupees per year for each farmer

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నది. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా రైతులకు పెట్టుబడి పథకాన్ని ప్రకటించారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నారు. ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి 6 వేల రూపాయలను నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి పంపించనున్నారు. 6 వేల రూపాయలను మూడు వాయిదా పద్ధతుల్లో 2 వేలకు చొప్పున రైతు ఖాతాలో వేయనున్నట్లు పీయూష్ తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా దాదాపు 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలు కానుంది. తొలి ఇన్ స్టాల్ మెంట్ కింద మార్చి 31, 2019న రైతుల ఖాతాలో రెండు వేలు జమ కానున్నాయి. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 75 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.

తెలంగాణలో ప్రారంభమయిన రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రెండు వాయిదాల్లో 4 వేల చొప్పున ఏడాదికి 8 వేలు ఇప్పటి వరకు అందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 వేలు ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news