ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అందులో రూ.1499 విలువల గల ఏడాది కాలవ్యవధి ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను కేవలం రూ.99కే అందించారు. అయితే విషయం తెలుసుకున్న ఫ్లిప్‌కార్ట్ సాంకేతిక సమస్య కారణంగానే ఆ విధంగా జరిగిందని తెలిపింది. కానీ రూ.99కి ఇప్పటికే ఆ సబ్‌స్క్రిప్షన్ ను తీసుకున్న వారి ట్రాన్సాక్షన్‌లను రద్దు చేస్తున్నామని, అందువల్ల ఆ సబ్‌స్క్రిప్షన్ ఎవరికీ లభించదని, ఇక రూ.99 మొత్తాన్ని వినియోగదారులకు రీఫండ్ చేస్తామని కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
కాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి రూ.1499 ఉండగా, వీఐపీ సబ్‌స్క్రిప్షన్ రూ.399కి లభిస్తోంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి హాలీవుడ్ కంటెంట్ లభిస్తుంది. అయితే పలు రీచార్జి ప్లాన్లకు జియో, ఎయిర్‌టెల్‌లు ఇప్పటికే వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నాయి. దీంట్లో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా వీక్షించేందుకు వీలుంది.
అయితే ఫ్లిప్‌కార్ట్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కు చెందిన వోచర్లను విక్రయిస్తున్నారు. వాటిల్లో రూ.1499 ఓచర్ ధర రూ.99గా తప్పుగా నమోదైంది. దీంతో పలువురు వినియోగదారులు భారీ మొత్తంలో డిస్కౌంట్‌తో హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను పొందారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల అలా జరిగిందని ఫ్లిప్‌కార్ట్ చెప్పడంతో వారికి ఆ సబ్‌స్క్రిప్షన్ లభించదు. కానీ వారు చెల్లించిన రూ.99 మాత్రం రీఫండ్ అవుతుంది.