ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో దళిత యువతిపై కొంత మంది కామాంధులు దారుణంగా అత్యాచారం చేసి చివరికి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంకా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై అటు సి.బి.ఐ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో హత్రాస్ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
హత్రాస్ బాధితురాలిని పొలాల్లోకి లాక్కెళ్ళి కొంత మంది నిందితులు ఆమెను పంట పొలంలో కి తోసారూ. తర్వాత సామూహిక అత్యాచారం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ పొలానికి చెందిన యజమాని తన పంటకు నష్టపరిహారంగా అధికంగా 50,000 చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతుండటం సంచలనంగా మారింది. ఇక ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీపీఐ బృందం పంట పొలంలో పరిశీలించారూ. అయితే సాక్ష్యాధారాలను సేకరించే వరకు పంటకు నీళ్లు పెట్టడం కానీ కోయటం కానీ చేయవద్దు అంటూ అధికారులు రైతును ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆ రైతు 50,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరారు.