మనకు ఏది ఎక్కడ ఉండాలో అవి అక్కడ ఉంటేనే ప్రశాంతంగా బతకగలం..లేకుంటే..సమాజం మనల్ని వింత మనిషి అని ముద్ర వేస్తుంది. ఆ చూపులు తట్టుకోని నిలబడటం చాలా కష్టం.. అలాంటి వారు కూడా ఉన్నారు..కానీ మీరు ఒక మనిషికి ఒళ్లంతా జుట్టు ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? కోతికి ఉన్నట్లు..పాపం ఆ వ్యక్తికి ముఖంతో సహా మొత్తం జుట్టే.. చూస్తే..అసలు మనిషేనా లేక మృగమా అనిపిస్తుంది.
మధ్యప్రదేశ్ నంద్ లేతా గ్రామానికి చెందిన లలిత్ పాటిదార్ వయసు 17ఏళ్లు. అతడి శరీరం మొత్తం వెంట్రుకలే. లలిత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అదే hypertrichosis (వెంట్రుకలు విపరీతంగా పెరగడం). దీన్ని werewolf syndrome అని కూడా అంటారు. లలిత్‌కు.. ఆరేళ్ల వయసులో ఈ వ్యాధి బయటపడింది. అప్పటి నుంచి అతడి శరీరం అంతటా వెంట్రుకలు వస్తున్నాయి.. తాను చూడటానికి తోడేలులా ఉంటానని, కరుస్తానేమో అని.. స్కూల్‌లో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ బాధపడుతున్నాడు.. వెంట్రుకలు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటాడట.. మధ్యయుగం నాటి నుంచి కేవలం 50 మందికే ఈ వ్యాధి వచ్చిందని, దీనికి చికిత్స లేదని వైద్యులు అంటున్నారు. పాపం తను జీవితాంతం ఈ వ్యాధితో పోరాడాల్సిందేనా..?
లలిత్ ఒళ్లంతా వెంట్రుకలే ఉంటాయి. కళ్ళు ఏవి, ముక్కు ఏది అసలు కనిపించవు.. అతడి క్లాస్ మేట్స్ అతడిని మంకీ బాయ్ అంటారు. తాను వారిని ఎక్కడ కరుస్తానో అని వారంతా భయపడతారని లలిత్ తెలిపాడు. లలిత్‌ది సాధారణ కుటుంబం..తండ్రి రైతు.. ప్రస్తుతం 12వ గ్రేడ్ చదువుతున్నాడు. చదువుకుంటూనే.. వ్యవసాయంలో తండ్రికి సాయం చేస్తాడట..
లలిత్ పుట్టిన సమయంలోనే డాక్టర్ షేవింగ్ చేశాడట. ఆరేళ్ల వయసు వచ్చే వరకు ఒళ్లంతా వెంట్రుకల విషయాన్ని ఎవరూ గమనించ లేదు. ఆరేళ్ల వయసులో తనకు తెలిసింది. ఇతరుల కన్నా భిన్నంగా తన శరీరం అంతా వెంట్రుకలు మొలుస్తున్నాయని. ఆ తర్వాతే తెలిసింది. హైపర్ ట్రై కోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు..
తన పరిస్థితి గురించి ఎప్పుడూ బాధపడలేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడుతున్నారు అని లలిత్ తెలిపాడు. తనను చూసి పిల్లలు జడుసుకునే వారు. చిన్న వయసులో అర్థం కాలేదు. వయసు పెరిగాక అర్థమైంది. మనం మనకున్న చిన్న లోపాలతోనే చాలా బాధపడుతుంటాం..ఒక్కసారి లిలిత్ ఫోటో చూడండి.. ఆ పరిస్థితుల్లోనే తాను ఈ సమాజం చూసే వింత చూపులను తట్టుకోని.. సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నాడు.. హ్యాపినెస్ అనేది..ఎక్కడి నుంచో ఎందులోంచో రాదు.. మనకు మనం ఫీల్ అవ్వాలి..గుండె నిండా సంతోషం నింపుకోవాలి..పరిస్థితులను అంగీకరించి ముందుకువెళ్లాలే తప్ప..ఇదేంట్రా అని ఆగిపోతే..ఇంకా ఆపేసేవాళ్లు చుట్టూనే ఉంటారు..!