యువత కోసం కేంద్రం సరికొత్త పథకానికి శ్రీకారం

-

యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేరా యువ భారత్/మై భారత్ పేరుతో ఓ స్వయంప్రతిపత్తి కలిగిన వేదికను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం లక్ష్యం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో పంచుకున్నారు.

Key resolution adopted during opposition meet was to get Rahul Gandhi  married: Anurag Thakur - The Week

యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మేరా యువ భారత్ లక్ష్యమని తెలిపారు. యువత తమకు కావాల్సిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ వేదిక ద్వారా 15 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్రయోజనం ఉంటుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే, కేబినెట్ భేటీలో కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం మూడు శాతం, అరుదుగా లభించే మరో ఖనిజంకు ఒక శాతం రాయల్టీ విధించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news