తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

-

వర్షాకాలం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి లోక్ సభలో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సమాధానమిచ్చారు. ఈ ఏడాది బియ్యం సేకరణ ప్రక్రియను అక్టోబర్‌‌ నుంచి ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో 2021–22 రబీ పంట దిగుబడిలో బియ్యం సేకరణ ఆగలేదని ఆమె స్పష్టం చేశారు సాధ్వీ నిరంజన్ జ్యోతి. ప్రధాన మంత్రి గరీబ్‌‌ కళ్యాణ్‌‌ అన్న యోజన 6వ దశ కింద రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేయకపోవడం, అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల తెలంగాణలో బియ్యం సేకరణ ప్రక్రియ జూన్‌‌ 7 నుంచి జూలై 19వ తేదీ వరకు నిలిపివేశామని సాధ్వీ నిరంజన్ జ్యోతి వివరించారు.

Telangana farmers unhappy with paddy procurement by PACS

పీఎంజీకేఏవై బియ్యాన్ని పంపిణీ చేస్తామని రాష్ట్ర సర్కార్ అంగీకరించాక.. బియ్యం సేకరణ ప్రక్రియను జులై 20 నుంచి పునరుద్ధరించామని వెల్లడించారు సాధ్వీ నిరంజన్ జ్యోతి. తెలంగాణలో 2014–15 నుంచి 2021–22 వరకు 4.23 కోట్ల మెట్రిక్‌‌ టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు సాధ్వీ నిరంజన్ జ్యోతి.

 

Read more RELATED
Recommended to you

Latest news