తిరుమల సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, నందమూరి రామకృష్ణ

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గడంతో పలువురు ప్రముఖలు స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు, నిర్మాత నందమూరి రామకృష్ణలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. బావ నారా చంద్రబాబునాయుడు సీఎం అయితే, తిరుమల స్వామి వారిని కాలినడకన దర్శించుకుంటానని మెుక్కుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబును తిరిగి సీఎంను చేసిన ఏపీ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.కాగా, ప్రస్తుతం తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాదారణంగా కొనసాగుతోంది. దానా తుఫాన్ ఎఫెక్ట్ తిరుమల భక్తుల రద్దీపై పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news