BREAKING : దొరికిన ఆ నలుగురు దుండగులు..! ఎవరో తెలుసా..?

శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సినీ నటుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర ఓ గుర్తుతెలియని కారు కలకలం రేపిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని జల్‌పల్లి గ్రామ శివారులో ఉన్న మోహన్‌ బాబు ఇంట్లోకి కారులో దూసుకొచ్చిన దుండగులు మిమ్మల్ని వదలమంటూ హెచ్చరించి వెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లు తెలిసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని గుర్తించారు. వారు మైలార్దేవ్పల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కాగా, దుండగులు  విజయలక్ష్మి అనే మహిళ పేరుపై రిజిస్టర్ అయిన ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారు లో మోహన్ బాబు ఇంటిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.