ఆయాసపడుతున్న బాబుకు ఆవేశం తెప్పించే సూచన ఇది!

-

అమరావతిలో పూర్తి రాజధాని లేకుండా.. శాసన రాజధానికి అక్కడే ఉంచుతూ.. పరిపాలనా రాజధాని విశాఖకు, న్యాయ రాజధాని కర్నూలు మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతీ తెలిసిందే. దీంతో… “నన్ను నమ్మి భూములు ఇవ్వండి” అని అడిగి మూడు పంటలు పండే భూములు తీసుకున్న చంద్రబాబుకు.. తమ్ముళ్లు, అమరావతి రైతులు కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు.

అమరావతి ప్రాంతంలోని కొందరు రైతులు “పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును” వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఈ సమయంలో చంద్రబాబు ఆన్ లైన్ లో ఆవేశపడితే చాలదని.. అమరావతికొచ్చి పోరాడాలని.. ఏమాత్రం వెనక్కి తగ్గి, స్వార్థ రాజకీయ ఆలోచనలు చేసినా రైతుల శాపాలు తగలకుండా పోవని అంటున్నారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎలా ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేశారో అలానే చంద్రబాబు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బాబు ఆ పనిలో ఉండటంతో పాటుగా… ఉన్న 20మంది ఎమ్మెల్యేలతో రాజినామాలు చేయించి.. అమరావతిపై తనకున్న ప్రేమను, రైతులపై ఆయనకున్న గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని.. ఈ విషయంంలో కేసీఆర్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఆవేశపడినంత మాత్రాన్న… జూం లో కళ్లు తుడుచుకున్నంతమాత్రాన్న రైతులకు ఒరిగేదీ ఏమీ లేదనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని కోరుతున్నారు.

నిజంగా రైతులు, తెలుగు తమ్ముళ్లూ కోరారని కాదు కానీ… ప్రస్తుతం చావుతప్పి కన్ను లొట్టబోయిన పార్టీకి పూర్వ వైభవం తెప్పించే పనుల్లో భాగంగా అయినా.. చల్ల బడిన కార్యకర్తల్లో వేడి పుట్టించే చర్యల్లో భాగంగా అయినా.. చంద్రబాబు ఇలాంటి ఆలోచనలు చేయడం గొప్ప సువర్ణావకాశం అనేది విశ్లేషకుల మాటగా ఉంది. మరి బాబు వీరి సూచనలు విని ఆచరణలో పెట్టి.. తానేంటో నిరూపించుకుంటారా? లేక… ఆన్ లైన్ లో ఆవేశపడుతూ – జూం లో ఆయాసపడుతూ ఇలానే నెట్టుకొస్తారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news