మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు మధ్య సైలెంట్ వార్ జరుగుతోందని ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మా ఎన్నికల్లోనూ చిరంజీవి తనను పోటీ నుండి తప్పుకోమన్నారని విష్ణు వ్యాఖ్యానించారు. దాంతో వారి మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా బాలయ్య తన టాక్ షోలో చిరంజీవి పై మీ అభిప్రాయం ఏంటి అంటూ మోహన్ బాబు ను ప్రశ్నించారు. దానికి మోహన్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు.

చిరంజీవి గురించి వ్యక్తిగతంగా తనకు ఎలాంటి దురభిప్రాయం లేదని మోహన్ బాబు అన్నారు. అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. సురేఖ తనకు సోదరి అని భావిస్తానని అన్నారు. ఆ లెక్కన చిరంజీవి మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మంచి పొజిషన్ లో ఉన్నాడు అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవితో ఎన్నో సినిమాలు చేశాను అని అతను అద్భుతమైన నటుడు మరియు డాన్సర్ అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.