కూతురు ఏడుస్తుందని తండ్రిని విడుదల చేసిన యూపీ ప్రభుత్వం..

-

దీపావళి పండగ వస్తుందంటే చాలు పటాసులు కాల్చవద్దంటూ, కాలుష్యం పెరిగిపోతుందంటూ, బాణసంచా కారణంగా అది మరింత తీవ్ర రూపం దాల్చుతుందని వాదిస్తుంటారు. ఐతే ఈ సారి కరోనా మహమ్మారి బాగా విజృంభిస్తుంది. అందువల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పటాసులు పేల్చవద్దంటూ నిషేధం విధించింది. ఈ మేరకు చాలా రాష్టాల్లో పటాసులు పేల్చడాన్ని, అమ్మడాన్ని నిషేధించారు.

ఉత్తరప్రదేశ్ లో కూడా బాణసంచాని నిషేధించారు. ఐతే నియమాలకి విరుద్ధంగా బాణసంచా అమ్ముతున్నారన్న ఉద్దేశ్యంతో ఒక వర్తకుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. దాంతో ఆ వర్తకుడి కూతురు పోలీసు జీబు వద్ద ఏడుస్తూ కూర్చుంది. ఆ జీబుని ఎటూ కదలనీయకుండా మా నాన్నని వదిలేయండంటూ మొరపెట్టుకుంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. దాంతో సొషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు యూపీ సీఎమ్ యోగీ ఆదిత్యనాథ్ ని ట్యాగ్ చేస్తూ, పండగ పూట ఆడబిడ్డని ఏడిపించకండని ట్వీట్లు పెట్టారు.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాలని పరిగణలోకి తీసుకున్న యోగీ ఆదిత్యనాథ్ గారు ఆ వర్తకుడిని విడుదల చేయించి కూతురు వద్దకి పంపించాడు. పండగపూట ఆ వర్తకుడు మిఠాయిలు తీసుకుని కూతురు వద్దకు వెళ్ళాడు.

Read more RELATED
Recommended to you

Latest news