యూపీకి చెందిన ఇండియా క్రికెటర్ మరియు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తూ ఇండియా విజయాలలో కీలకంగా మారుతున్నాడు. ఇక మొన్న జరిగిన సెమి ఫైనల్ లోనూ 7 వికెట్లతో చెలరేగి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇతని ప్రదర్శనకు ముగ్ధుడు అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ఒక బంపర్ ఆఫర్ ను మహమ్మద్ షమీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చాడు. షమీ కుటుంబం నివసించే గ్రామంలో ఒక మినీ స్టేడియం ను నిర్మించడానికి యువజన సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుందట. ఇక గ్రామ అధికారి స్టేడియం కోసం అనువైన స్థలాన్ని కనుగొనగా, డెవెలప్ మెంట్ అధికారి మిగిలిన ఏర్పాట్లను చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్రామంలో బయటపడని సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి యూపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
దీనితో మహమ్మద్ షమీ చాలా సంతోషపడి ఉంటాడనిపిస్తోంది.. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్ లోనూ రాణించి ఇండియాకు మూడవ కప్ ను అందించాలని కోరుకుందాం.