తెలంగాణలో ధరణి పోటలు అతిపెద్ద స్కాం అని బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. ధరణిలో చాలా లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడుకి లక్ష్మణ్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ధరణి పోటల్ నిర్వహణకు తొలత టీసీఎస్ కు ఇచ్చి ఆ తర్వాత ఐఎల్ఎఫ్ కి అప్పగించారని చివరకు టెర్రాస్ సిఐఎస్ వచ్చిందని తెలిపారు.
వ్యక్తుల వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థ టెర్రస్ సీఐఎస్ చేతిలోకి చేరిందన్నారు. ధరణి లో ఉన్న లోపాలపై ఎలాంటి ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఇందుకోసం బీజెపి ఈమెయిల్ వాట్సాప్ ద్వారా ధరణి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. నెంబర్లకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అలాంటి వారికి బీజెపి ప్రభుత్వం వచ్చాక న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజెపి అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని జ్యోష్యం చెప్పారు.