దేశవ్యాప్తంగా యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటన సంచలనం రేపింది. రైతు చట్టాలకు నిరసన తెలుపుతున్న క్రమంలో రైతులపైకి కేంద్రమంత్రి కాన్వాయ్ వాహనాలు వెళ్లడంతో ఘటన చోటు చేసుకుంది. ఘటనలో రైతులతో సహా 9 మంది మరణించడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాజాగా ఘటనకు బాధ్యుడిగా ఆరోపనలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా యూపీ క్రైం బ్రాంచ్ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు.జరిగిన ఘటనపై పోలీసులు ఆశిష్ మిశ్రాను ప్రశ్నించనున్నారు. ప్రమాదం జరిగే సమయంలో కాన్వాయ్ లో ఆశిష్ మిశ్రా కూడా ఉన్నట్లు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న సుప్రీం కోర్ట్ కూడా లఖీంపూర్ రైతుల మరణాలపై ఫైర్ అయింది. నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాపై కేసు ఫైల్ చేయకపోవడంతో యూపీ సర్కారుకు చివాట్లు పెట్టింది. దీంతో అధికారులు ఆశిష్ మిశ్రాను పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఘటన జరుగున్న సమయంలో నేను వేరే చోట ఉన్నానని ఆశిష్ మిశ్రా పేర్కొంటున్నాడు. యూపీ ఎన్నికల ముందు జరిగిన రైతుల మరణాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.