హుజూరాబాద్ ఉప ఎన్నిక : కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్లు వీళ్లే

హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌ స్ట్రాటజీ కమిటీ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశం పిసిసి చీఫ్ రేవంత్ అధ్యక్షతన జరిగింది. హుజూరాబాద్ ఎన్నిక ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరిగింది. అంతేకాదు ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల స్టార్ క్యాంపైనర్ జాబితాను విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

congress
congress

అయితే.. ఈ లిస్టు లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి మరియు మాజీ పిసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఇక స్టార్ క్యాంపైనర్ జాబితా వివరాల్లోకి వెళితే…. . ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం, దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి, Vh, పొన్నాల, అజారుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, డీసీసీ కవ్వం పల్లి సత్యనారాయణ, డీసీసీ నాయిని రాజేందర్ ఈ లిస్టు లో ఉన్నారు. కాగా… ఈ హుజురాబాద్‌ ఉప ఎన్నిక అక్టోబర్‌ 30 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.