పోలీసా.. మజాకా.. హ్యాట్సాఫ్ సారూ..!

-

పోలీసులు డ్యూటీలు మాత్రమే కాదు..మానవత్వాన్ని కూడా చాటుతున్న ఘటనలు కూడా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము..తాజాగా మరో ఉదార ఘటన వెలుగు చూసింది.కుటుంబాన్ని పోషించడం కోసం తాము ఏమైపోయినా పర్వాలేదని గొడ్డు చాకిరీ చేస్తుంటారు. ఎంతలా అంటే కనీసం పాదాలకు చెప్పులు లేకుండా ఎండలో పనిచేస్తుంటారు.

డబ్బు దానం కంటే.. వారికి అవసరమైన వస్తువులను ఇవ్వడం వారికి తృప్తినిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇది మీ హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఇంకా.. మీ కళ్లలో, మనస్సులో ఆనందాన్ని నింపుతుంది. రోడ్డుపై చెప్పులు లేకుండా నడుస్తున్న కార్ట్ పుల్లర్‌కు యూపీ పోలీసు అధికారి చెప్పులు కొనిచ్చిన ఘటనకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రిక్షా లాగే వ్యక్తి చెప్పులు లేకుండా రోడ్డుపై నడుస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. రోడ్డు పక్కన ఉన్న ఒక పోలీసు అది చూసి వెంటనే ఆ వ్యక్తికి కొత్త చెప్పులు కొని ఇచ్చాడు. అతను వెంటనే ఆనందంతో చప్పల్స్ ధరించాడు. అంతేకాకుండా తన పరిస్థితిని చూసి చలించిపోయిన పోలీసుకు కృతజ్ఞతలు చెప్పాడు.ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలలోనే లక్షల్లో వ్యూస్ ను రాబట్టింది.మీరు కూడా ఆ వీడియోను చూసి లైక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version