అతని మాయలో పడి అమ్మాయిగా మారాడు.. ఆపై మోసపోయాడు.

ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ ఉరువా ప్రాంతానికి చెందిన ఓ ధోలక్ ప్లేయర్,  మరో మగడాన్సర్ ను లింగమార్పిడి చేసి మోసం చేసిన ఘటన సంచలనం కలిగించింది. సదరు ధోలక్ ప్లేయర్ మహ్మద్ ముంతాజ్ బాధితుడిని 2020లో ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడే బాధితుడు తినే ఆహారంలో మత్తు మందు కలిపాడు, బాధితుడి ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించాడు.

అయితే అక్కడే ఆసుపత్రిలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడని బాధితుడు గుర్తించాడు. ఆ తరువాత ఇద్దరు డిల్లీలో డ్యాన్సు ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించారు. కాగా ఇటీవల తిరిగి సొంతూరుకు వచ్చిన తర్వాత మహ్మద్ ముంతాజ్ కు ఇదివరకు పెళ్లయి పిల్లలు ఉన్నారని బాధితురాలు గుర్తించింది. ఇది తెలిసి డ్యాన్సు ప్రదర్శనల ద్వారా వచ్చిన రూ. 10 లక్షలు, రూ. 4 లక్షల విలువైన నగదును దోచుకుని ముంతాజ్ ఉడాయించాడు. దీంతో బాధితురాలు గోలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి ధర్మేంద్ర కుమార్ దొంగతనం, ఎస్సీ,ఎస్టీ చట్టాలతో పాటు 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.