నవంబర్‌ 1 వ తేదీ నుంచి కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు ; సోనియా గాంధీ

-

పార్టీ పటిష్టంపై సోనియా గాంధీ ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్టీ అగ్రనేతలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సోనియా గాంధీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని… కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ 1 నుంచి మొదలై 2022 మార్చి 31న ముగుస్తుందని చెప్పారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ మీ అందరికీ తెలుసని… ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రాణాధారమన్నారు.

దేశంలో యువత తమ గొంతు వినిపించాలని ఎదురుచూస్తున్నారని… వారికి ఒక వేదికను అందజేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. కొన్ని తరాలుగా మనం ఈ పని చేస్తున్నామని… ప్రతి గ్రామం, ప్రతి వార్డుకు చేరేలా సభ్యత్వ నమోదు పత్రాలను సిద్ధం చేసి, పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి గడపకూ వెళ్లి సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని.. అలాగే కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు చాలా అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, భావజాలాన్ని విస్తృతపర్చడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని.. బీజేపీ-ఆరెస్సేస్ సైద్ధాంతిక ప్రచారంపై మనం పోరాడాలని వెల్లడించారు. వారి అవాస్తవాలను బయటపెట్టి, ఈ యుద్ధంలో గెలవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news