అపోలో వారసురాలు మెగా కోడలు ఉపాసన గురించి.. ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులకు సహాయ సహకారాలు అందించడంలో మామ చిరంజీవికి మించి ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఉపాసన అంటే సినీ ప్రేక్షకులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎనలేని అభిమానం.
అయితే, తాజాగా మెగా కోడలు ఉపాసన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఙత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ గుర్తించుకుంటాను అని తెలిపారు ఉపాసన.
She lived a life filled with gratitude, empathy & dignity till the very end.
I made peace with her departure by learning to celebrate her life.
RIP Pushnani 🙏I promise to give my children similar experiences I cherished with my grandparents🙏 pic.twitter.com/37FMehekS8
— Upasana Konidela (@upasanakonidela) January 23, 2023