“KGF 3” గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్డేట్ !

-

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హీరో యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేసిన ప్రభంజనం అంతా ఇంత కాదు. కెజిఎఫ్ చాప్టర్ 1 మరియు 2 ల ద్వారా ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమాలు సాధించిన ఘనవిజయాలు కారణంగా ప్రేక్షకులకు నెక్స్ట్ చాప్టర్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 3 గురించి ఒక కీలక కామెంట్ చేశారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, కెజిఎఫ్ చాప్టర్ 3 స్క్రిప్ట్ మొత్తం రెడీ అయింది.. కానీ ఈ సినిమాకు నేను డైరెక్షన్ చేస్తానో లేదా అంటూ చెప్పాడు. ఈ కామెంట్ విన్న అభిమానులు చాలా నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ టేకింగ్ మరియు ఎలివేషన్స్ ఏ విధంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించే దైర్యం చేసే దర్శకుడు ఎవరున్నారు అంటూ ఆలోచనలో పడ్డారు సినిమా అభిమానులు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news