బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ ఎవరు అనేది ఈ ఆదివారం ఎపిసోడ్లో తెలియనుంది. హోస్ట్ నాగార్జున సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేసి విజేతని ప్రకటించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫినాలేలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీలు ఉన్నారు. వీరికి మిస్డ్ కాల్స్, హాట్స్టార్ యాప్ ద్వారా అభిమానులు ఓటింగ్ వేస్తున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఇదంతా పూర్తయిన తర్వాతే షో నిర్వాహకులకు విన్నర్ ఎవరనేది తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ ఎవరనే దాని మీద పలు మీడియా వెబ్ సైట్స్ ఆన్ లైన్ సర్వేలు చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం రాహుల్-శ్రీముఖిల మధ్య గట్టి పోటీ జరుగుతుందని తేల్చాయి. కానీ రాహుల్ కు విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలు సైట్లు చెబుతున్నాయి. మొదట్లో పెద్దగా గేమ్ మీద దృష్టి పెట్టని రాహుల్…..చివరికొచ్చేసరికి బాగా తెలివిగా గేమ్ ఆడటం కలిసొచ్చింది.
మిగిలిన కంటెస్టెంట్స్ కంటే తెలివిగా ఆడటంతో రాహుల్ ఇమేజ్ అమాంతం పెరిగింది. దాంతో రాహుల్ అందరికంటే ముందున్నాడని అంటున్నారు. ఆ తర్వాత స్థానంలో శ్రీముఖి ఉందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు బిగ్బాస్ టైటిల్ విజేతగా ఎవరు ఫీమేల్ కంటెస్టెంట్స్ గెలవలేదు కాబట్టి.. శ్రీముఖి బిగ్బాస్ 3 టైటిల్ కైవసం చేసుకుంటుందని కొందరు జోస్యం చెబుతున్నారు.
ఇక బాబా భాస్కర్ కు కూడా బాగానే ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే శ్రీముఖి, రాహుల్ స్థాయిలో బాబాకు ఓటింగ్ రావడం లేదు. అటు వరుణ్, అలీలకు అయితే అతి తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు తెలిసింది. మొత్తానికి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు రాహుల్ కు ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత శ్రీముఖికు అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. చూడాలి మరి వీరిద్దరిలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారో.