బీజేపీ నాయకులకు అర్థం పర్థం లేని, మతి చలించిన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తల తిక్క వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకున్న సందర్భాలు ఉన్నాయి.
కోడిగుడ్లను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పెద్దలే కాదు, పిల్లలకూ కోడిగుడ్లను తినిపించడం వల్ల వారికి సంపూర్ణ పోషణ అందుతుంది. వారిలో ఎదుగుదల బాగుంటుంది. ఈ విషయాలను చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. కానీ ఆ రాజకీయ నాయకుడికి మాత్రం ఈ విషయాలు తెలియవో లేదంటే.. ఉన్న మతి కాస్తా చలించిందో తెలియదు కానీ.. పిల్లలకు కోడిగుడ్లు పెడితే వారు పెద్దయ్యాక మనుషులను తింటారని కామెంట్ చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బీజేపీ నాయకులకు అర్థం పర్థం లేని, మతి చలించిన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తల తిక్క వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రతి పక్ష పార్టీ నాయకుడు గోపాల్ భార్గవ్ కూడా మతి లేని వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు కోడిగుడ్లను పంపిణీ చేసే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. అయితే దానిపై గోపాల్ భార్గవ్ స్పందిస్తూ.. పిల్లలకు కోడిగుడ్లను పెట్టడం వల్ల వారు పెద్దయ్యాక మ్యాన్ ఈటర్స్ (మనుషులను తినేవారు)గా మారుతారని అన్నారు.
కాగా గోపాల్ భార్గవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనను పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఆయనకు మతి స్థిమితం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. చిన్నారులకు కోడిగుడ్లను పెట్టడాన్ని అలా అభివర్ణించడం సరికాదని అంటున్నారు. కాగా గతంలో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా అప్పటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అంగన్‌వాడీల్లో పిల్లలకు కోడిగుడ్లను పెట్టడాన్ని వ్యతిరేకించడం, ఇప్పుడు గోపాల్ భార్గవ్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది..!