ఉప్పెన హక్కులు నెట్ ఫ్లిక్స్ చేతికి.. భారీ బడ్జెట్ పెట్టి మరీ..

-

పంజా వైష్ణవ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరో. సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన పంజా వైష్ణవ్ తేజ్, ఉప్పెన చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. లాక్డౌన్ కారణంగా ఇంకా రిలీజ్ కాని ఈ సినిమా, ఓటీటీలోనూ విడుదల కావట్లేదు. థియేటర్లలోనే విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాని ఓటీటీకి అమ్మడం లేదు.

ఐతే తాజాగా ఉప్పెన చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతికి అందాయని అంటున్నారు. సినిమాపై ఉన్న నమ్మకంతో భారీ ధర పెట్టి మరో హక్కులు కొనుక్కున్నట్లు తెలుస్తుంది. ముందుగా అమెజాన్ ప్రైమ్ రైట్స్ కొనుక్కోవడానికి ముందుకు వచ్చిందట. కానీ నెట్ ఫ్లిక్స్ భారీగా వెచ్చించి మరీ హక్కులు కొనుక్కుందట. మెగా హీరో మొదటి సినిమా రిలీజ్ అవకముందే డిజిటల్ రైట్స్ భారీ రేంజిలో అమ్ముడయ్యాయంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version