ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ UPSC) ఢిల్లీ ఎన్‌సీటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో 363 ప్రిన్సిపల్ పోస్టులని భర్తీ చెయ్యనున్నారు.
ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 363 వున్నాయి.
పురుషులు- 208, స్త్రీలు- 155. జులై 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులయ్యిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే 50 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
7వ పే కమిషన్ ప్రకారం–ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు. కనీసం 10ఏళ్లు టీచింగ్‌లో అనుభవం ఉండాలి అని నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.25.