పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన అన్ని విమానాలపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. పాక్‌కు చెందిన పైలట్లలో చాలా మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉన్నారని ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు ప్రకటించారు. పాక్ పైలట్లలో మూడో వంతు మంది దగ్గర నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇటీవల తేలింది. దీంతో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
యూరోపియన్ యూనియన్ పీఐఏపై ఇప్పటికే నిషేధం విధించింది. ఆరు నెలలపాటు ఈయూకు అంతర్జాతీయ విమానాలు నడపడానికి వీళ్లేదని పేర్కొంది. పాకిస్థాన్‌లోని కరాచీలో విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో పీఐఏ జెట్ విమానం కూలడంతో మే 22న 97 మంది మరణించిన విషయం తెలిసింది. ఆ విమానం నడిపిని పైలట్లవి కూడా నకిలీ సర్టిఫికెట్లేనని తేలింది.