ఇరాన్ సరిహద్దుల్లో మోహరించిన అమెరికా, భారీగా సైన్యం…!

-

ఇరాన్-అమెరికా యుద్ధం జరుగుతుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రెండు రోజుల క్రితం ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులైమానీని అమెరికా బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హతమార్చిన తర్వాత ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. దీనితో మధ్య ప్రాచ్యంలో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇరాన్ ని అమెరికా కవ్విస్తున్నట్టే కనపడుతుంది. ఇరాన్ సరిహద్దుల్లో భారీగా అమెరికా బలగాలను మొహరించారు. గత ఏడాది ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ తో పోరాటానికి గాను 14 వేల మంది అమెరికా సైన్యాన్ని పంపగా, ఇప్పుడు అదనంగా మరో 4 వేల మందిని ఇరాన్ కి అమెరికా తరలించింది. ఉద్రిక్తతల మధ్య, పెంటగాన్ ఇరాక్ పొరుగున ఉన్న కువైట్ కు 3,500 మంది అదనపు యుఎస్ దళాలను పంపించనున్నట్లు పేర్కొంది. మరో 5, 200 మంది సైనికులను అక్కడికి పంపించే అవకాశం ఉందని అంటున్నారు.

ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతలో యుఎస్ పౌరులు వెంటనే ఇరాక్ నుండి బయలుదేరాలని కోరారు. మరియు దక్షిణాన ఉన్న చమురు క్షేత్రాల నుండి అమెరికన్ సిబ్బందిని తరలించారు. “సైనిక చర్యకు ప్రతిస్పందన సైనిక చర్య” అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి మాజిద్ తఖ్త్ రావంచీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇరాన్ అమెరికా మధ్య దశాబ్దాలుగా ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేని సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news