ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అమెరికా ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుస్తాడా లేక కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత్ లోని దేశీయ మార్కెట్ల పై అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళాయి.
సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 40,388 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 96 పాయింట్లు ఎగబాకి 11,909 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 74.37 వద్ద కొన సాగుతోంది. అమెరికా ఎన్నికల ఫలితాల సరళి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా కొనసాగుతుండడం మదుపర్ల సెంటిమెంటును పెంచిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడింది. ఒక వేళ ట్రంప్ ఓటమి పాలయితే స్టాక్ మార్కెట్ లు మరింత లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది.