సైకిల్ తొక్కుతూ కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్

-

సరదాగా సైకిల్ ఎక్కిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కింద పడ్డారు. సైకిల్ దిగే సమయంలో బైడెన్ పాదం పెడిల్ లో ఇరుక్కుపోయింది. దీంతో కిందికి దిగాలని భావించారు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కుడివైపుకు పడిపోయారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

డెలావర్ లోని తన నివాసానికి సమీపంలో ఉన్న కేప్ హేన్లోపెన్ ఓపెన్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. తనను చూసేందుకు వచ్చిన వారి వద్దకు వెళ్లేందుకు బైడెన్ సైకిల్ ఎక్కి బయలుదేరారు.ఆ సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన తర్వాత బైడెన్ మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నానని.. ఆందోళన అవసరం లేదని అన్నారు. ఈ ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news