ట్రంప్ మళ్లీ గెలుస్తారా? సర్వేలేం చెప్తున్నాయి?

-

కరోనా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిందా? అమెరికా ఎన్నికలకు మరో వారం సమయమే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. జోబిడెన్, ట్రంప్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కన్నా ప్రజాదరణలో ముందున్నారని ఇటీవల జరిగిన పోల్ సర్వేలు చెప్తున్నాయి.

కీలక రాష్ట్రాల్లో బైడెన్ కు ప్రజల మద్దతు లభిస్తున్నట్లు తేలింది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ అయినప్పటి నుంచి ప్రజాదరణలో ట్రంప్ కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు బైడెన్. ట్రంప్ ఓడిపోవడం ఖాయమని ఎన్నికల విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

అమెరికా ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. ఆ రోజు ఓటు వేయడం కుదరని వారి కోసం ఇప్పటికే ఎర్లీ ఓటింగ్ కూడా మొదలైపోయింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ముందుగానే ఓటు హక్కును వినియోగించుకోవాలని డెమొక్రాట్లు కోరుతున్నారు. ముందుగానే ఓటు వేయడం ద్వారా నవంబర్ మూడో తేదీన క్యూ లేకుండా చూడొచ్చని అంటున్నారు. యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ ప్రకారం ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోపక్క జో బిడెన్ తో డిబేట్‌ లో పాల్గొంటానని ట్రంప్ ప్రకటించారు. ఈరోజు టెన్నెస్సీలోని బెల్మంట్ యూనివర్సిటీలో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు రెడీగా ఉన్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news