కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా విలవిలాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సుమారు 6,046,060 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య రెండు లక్షల వైపు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 1,80,000 మంది కరోనాకు బలయ్యారు. అంటే మరికొద్దిరోజుల్లోనే ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని, ఇది చాలా భయంకరమైన విషయమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతదారుణమైన పరిస్థితులు మరేదేశంలోనూ లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని చర్యలు తీసుకున్నా సఫలం కాలేకపోయారు. దీంతో ఒకానొక దశలో జనం పిట్టల్లా రాలిపోయారు. ఈ నేపథ్యంలో ముందుముందు ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24,335,741మంది కరోనా వైరస్ బారినపడగా 829,676మంది మరణించారు.