వాలెంటైన్స్‌ డే సర్ ప్రైజ్.. భర్త ఇచ్చిన గిఫ్ట్ చూసి భార్య షాక్

-

వాలెంటైన్స్ డే.. ఇది ప్రేమికులతో పాటు భార్యాభర్తలకు కూడా చాలా స్పెషల్ డే. చాలా మంది దంపతులు తమ లైఫ్ పార్టనర్లను సర్ ప్రైజ్ చేయడానికి రకరకాల గిఫ్టులు ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా ఓ భర్త తన భార్య కోసం ప్రేమికుల రోజున ఓ కానుక అందించాడు. అది చూసి సర్ ప్రైజ్ అవ్వడమేమో కానీ ఆమె షాక్ అయింది. ఇంతకీ అతడేం గిఫ్ట్ ఇచ్చాడంటే..?

థాయిలాండ్‌లో ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే టాటూ లా వేయించుకొని ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెంట్రల్‌ థాయిలాండ్ లోని సరాబురి ప్రావెన్స్‌లో  కెంగ్ ఖోయ్‌లోని టాటూ స్టూడియోలో ఎనిమిది గంటలు కుర్చీలో కూర్చొని చేతిపై తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని టాటూలా వేయించుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. తొలుత ఆ టాటూను చూసి అతడి భార్య షాక్‌ అయినప్పటికీ.. ఆ తర్వాత తన పట్ల ప్రేమ, గౌరవానికి రుజువుగా ఉన్న ఆ టాటూను అంగీకరించారట.

Read more RELATED
Recommended to you

Latest news